గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (11:15 IST)

పురీషనాళంలో బంగారం ఉంచి స్మగ్లింగ్..

వామ్మో.. బంగారం స్మగ్లింగ్ ఇప్పుడు రూట్ మారుతోంది. కాదేదీ స్మగ్లింగ్‌కు అనర్హం అన్నట్టు తమ శరీరాన్నికూడా స్మగ్లింగ్‌కు వాడుకొంటున్నారు కొందరు స్మగ్లర్లు. బ్యాగుల్లో, లో దుస్తుల్లో పెట్టుకుని బంగారాన్ని తెచ్చే స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా శరీరంలోపల బంగారాన్ని దాచి తెస్తున్నారు. బంగారాన్ని పేస్టులా మార్చి ఓ ప్రయాణీకుడు తన పురీషనాళంలో తెచ్చాడు. 
 
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఫ్లయిట్ నెంబర్ ఏవన్ 952 విమానంలో వచ్చిన ప్రయాణీకుడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి శరీరంలో ఏదో ఉన్నట్టు స్కానర్లు గుర్తించాయి. 
 
అతని శరీరంలోని పురీషనాళంలో దాచిన 720 గ్రాముల గోల్డ్ పేస్టుతో పాటు బంగారాన్ని కరిగించి తీసుకొస్తున్న 538.090 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందంటున్నారు. 
 
గతంలో కూడా ఇద్దరు ప్రయాణీకులు బంగారాన్ని మానవ శరీరాల్లోని పురీషనాళాల్లో దాచి తెస్తూ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కారు. ప్రాణాలను కూడా ఖాతరు చేయకుండా డబ్బుకు ఆశపడిన కొందరు ప్రయాణీకులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారని భావిస్తున్నారు అధికారులు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.