బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (13:27 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. ఏంటది?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ గుడ్ న్యూస్. సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఇతర రాష్ట్రాలకు చికిత్స కోసం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. 
 
ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1392.23 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్). 
 
అయితే, నాబార్డ్ విడుదల చేసిన నిధులతో వైఎస్ఆర్ కడప, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నారు.  
 
ఇదిలాఉంటే.. గో ఏపీ ఫ్లాగ్‌షిప్ నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాల ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.3,092 కోట్లు మంజూరు చేసింది నాబార్డ్. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.