శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (11:47 IST)

గుంటూరు రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లో పెనుమార్పులు: హోం మంత్రి సుచ‌రిత‌

గుంటూరు న‌గ‌రంలోని రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ల్లో పెను మార్పులు రాబోతున్నాయ‌ని ఏపీ హోం మంత్రి సుచ‌రిత చెప్పారు. గుంటూరు లోని పట్టాభిపురం నుంచి శ్యామల నగర్ వరకు కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర రావు, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, లక్ష్మణరావు, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్డు కు ఇరువైపులా హోంమంత్రి సుచరిత మొక్కలను నాటారు. నాయకులు, అధికారులతో కలిసి సిసి రోడ్ ను పరిశీలించారు.

గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నగరాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని సుచ‌రిత అన్నారు. గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలో పెనుమార్పులు వస్తున్నాయ‌ని, తడి చెత్త, పొడి చెత్త, చెట్ల ను నాటడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంమంత్రి అన్నారు.