ఆ బాలికను అనుభవించాడా? సరే ఈ 30 వేలు తీసుకుని కేసు వాపస్ తీసుకోండి

ఐవీఆర్| Last Modified శుక్రవారం, 27 నవంబరు 2020 (17:46 IST)
చిత్తూరు జిల్లాలో ఓ శీలానికి రూ. 30 వేలు కట్టారు. 15 ఏళ్ల బాలికను 30 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి ఎక్కడెక్కడో తిప్పి ఆమెను అనుభవించి ఆ తర్వాత ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు.

పూర్తి వివరాలను చూస్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలోని శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికపై కన్నేసాడు 30 ఏళ్ల హరీష్. ఆమెకు మాయమాటలు చెప్పి గత 19వ తేదీన ఆమెను తీసుకెళ్లిపోయాడు. బాలిక ఆచూకి లభించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగానే ఆమెను ఇంటి వద్ద వదిలివెళ్లాడు హరీష్.

ఇంటికి వచ్చిన బాలిక తనపై హరీష్ చేసిన వ్యవహారాన్నంతా చెప్పింది. దీనితో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే అదే రాత్రి హరీష్ తరపు పెద్దలు రూ. 30 వేలు ఇస్తామనీ, కేసు వాపసు తీసుకోమని చెప్పారు. అందుకు బాలిక బంధువులు అంగీకరించకపోవడంతో నిన్న రాత్రి బాలిక బంధువుల ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడి వారిని చితక్కొట్టారు. ఈ దాడిలో బాలిక బంధువులు పెద్ద రెడ్డెమ్మ, చిన్న రెడ్డెమ్మ గాయపడ్డారు. దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు ప్రాణ హాని వుందని తమను రక్షించాలని పోలీసులను కోరారు.దీనిపై మరింత చదవండి :