గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:35 IST)

ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు?: పవన్‌

రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు? అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈరోజిక్కడ పవన్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు నెలకొల్పడంలో ప్రభుత్వం బాధ్యతలు విస్మరిస్తోందన్నారు. కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే యువతకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నించారు.

ఉపాధి కల్పనకు ఆస్కారమున్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహ పరిస్థితులు కల్పిస్తే ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.

నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికల్లేని పాలకులను చూసి పరిశ్రమలు తరలిపోతున్నాయని గ్రహించాలన్నారు.