Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా కాపురానికి పిలుపించుకున్న భర్త.. ఎక్కడ..?

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (09:59 IST)

Widgets Magazine
victim

తన వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటే ఇక ఆ భార్యను చంపేయడమో.. లేక పుట్టింటికి పంపేయడమో చేస్తుంటారు. కానీ అలాంటి పని చేయలేదు ఓ భర్త. తన భార్య తప్పు తెలుసుకుంటుందని కాపురానికి పిలుపించుకున్నాడు. చిత్తూరు జిల్లా దుర్గానగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
రెండేళ్ళ క్రితం చిత్తూరు దుర్గానగర్ కాలనీలో నివాసముండే ప్రకాష్‌, ఉమామహేశ్వరికి పెద్దలు పెళ్లి చేశారు. వివాహం తర్వాత ప్రకాష్‌ సౌదీకి వెళ్ళిపోయాడు. ఉమా మహేశ్వరికి పెళ్ళి కాకముందే పవన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను జాగ్రత్తగా దాచుకున్నారు కూడా. 
 
ఉమామహేశ్వరికి పెళ్ళయిన తర్వాత ఆమె కువైట్‍లో ఉండటం డబ్బులు బాగా సంపాదిస్తుండటంతో ఆమె వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని పవన్ కుమార్ పన్నాగం పన్నాడు. నువ్వు నాతో వచ్చెయ్.. నీ భర్త దగ్గర డబ్బులు తీసుకురా లేకుంటే మన ఫోటోలను నీ భర్తకు పంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాదు తనతో ఒకరోజు పాటు భార్యలా గడపాలని కూడా బెదిరించాడు. 
 
పవన్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో ఉమామహేశ్వరి చేసేది లేక పవన్ కుమార్ ఇంటికి వెళ్ళింది. దీంతో పవన్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ వీడియోను చిత్రీకరించి పదే పదే ఆమెను లొంగదీసుకుంటూ వచ్చాడు. అంతటితో ఆగలేదు. ఆ వీడియోలన్నింటినీ నీ భర్తకు పంపుతాను.. నీ దగ్గర ఉన్న డబ్బులను తెచ్చివ్వు అంటూ బెదిరించసాగాడు. దీంతో ఉమామహేశ్వరి అసలు విషయాన్ని భర్తకు చెప్పింది. తాను మోసపోయిన విషయాన్ని కూడా భర్తకు చెప్పి బోరున విలపించింది. అయితే భర్త ప్రకాష్‌ ఆమెకు తోడుగా నిలబడ్డాడు.
 
కువైట్ నుంచి చిత్తూరుకు వచ్చి తన భార్యను పోలీస్టేషన్‌కు తీసుకెళ్ళి ఫిర్యాదు చేయించాడు. తన భార్య మోసపోయిందని, ఆమె లాగా ఎవరూ మోసపోకూడదని చెబుతున్నాడు. భార్య తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిందని, అదే తనకు చాలని చెబుతున్నాడు. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు. ప్రస్తుతం ఉమామహేశ్వరి ఆరునెలల గర్భిణి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేను ఎవరి మాటా వినను.. ఏపీకి గోసిపాత కూడా ఇవ్వరు : జేసీ దివాకర్

అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

సిటీ కోర్టు, ఐటీ టవర్ డిజైన్లు రెడీ... పరిశీలించిన సీఎం చంద్రబాబు(ఫోటోలు)

అమరావతి: సిటీ కోర్టు, ఐటీ టవర్ భవనాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ...

news

భవనంపై నుంచి పడుతున్న బాలుడిని ఎలా పట్టుకున్నాడో చూడండి (వీడియో)

ఈజిప్టు దేశంలో బాలుడి ప్రాణాలను ఓ కానిస్టేబుల్ రక్షించాడు. మూడో అంతస్తు నుంచి కిందికి ...

news

కేసీఆర్ బంపర్ ఆఫర్.. తెలంగాణ నిరుద్యోగులకు రూ.2 వేల భృతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ...

Widgets Magazine