అనుమానంతో వేటకొడవలితో భార్యను నరికి... భుజాన వేసుకుని...

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:53 IST)

murder

కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటకు చెందిన పెద్ద పుల్లన్న కుమారుడు లింగమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. ముగ్గురు పిల్లలు జన్మించిన తర్వాత కూడా గొడవలు ఆగలేదు. దీంతో భార్య అలంపూర్‌ కోర్టులో భర్తపై (మెయింటెనెన్స్‌) నిర్వహణ ఖర్చులు చెల్లించాలని దావా వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. 
 
అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగగా, లింగమయ్య భార్య పోషణకు నెల నెలా డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బనగానపల్లెలోని తెలుగుపేటలో భర్త ఇంటి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముగ్గురు పిల్లలను తన వద్దనే ఉంచుకొని టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా లింగమయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 
 
మహేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను వేటకొడవలితో నరికి చంపేశాడు. శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్లి తన ఇంటి వద్ద పడేసి మెట్లపై కూర్చున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భార్యను తానే చంపానని ఒప్పుకోవడంతో పోలీసులు లింగమయ్యను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

14 ఏళ్ల బాలుడు 20 గుడ్లు పెడుతున్నాడు.. ఎలాగో వైద్యులే కనిపెట్టలేక?

కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు ...

news

తెలుగోడిని రెచ్చగొట్టొద్దు.. మాడి మసైపోతారు : చంద్రబాబు వార్నింగ్

తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

news

హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా.. బాబే అలా?: సోమువీర్రాజు

తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ ...

news

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ...