బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 23 జూన్ 2018 (12:40 IST)

భర్త కాళ్లూ చేతులూ కట్టేసి ఆరు నెలలు గృహనిర్భందం చేసిన భార్య.. ఎందుకు?

కట్టుకున్న భార్య, భర్తపై దాడిచేసి గృహనిర్భందం చేసిన ఘటన తాజాగా తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం మిలటరీ కాలనీలో జరిగింది. ఇల్లరికం వచ్చిన భర్త కాళ్లూచేతులూ విరిచి కట్టేసి అతి కర్కశంగా గదిలో ఆరు నెలలు బంధించింది భార్య. తలకు గాయమై రక్తం

కట్టుకున్న భార్య, భర్తపై దాడిచేసి గృహనిర్భందం చేసిన ఘటన తాజాగా తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం మిలటరీ కాలనీలో జరిగింది. ఇల్లరికం వచ్చిన  భర్త కాళ్లూచేతులూ విరిచి కట్టేసి అతి కర్కశంగా గదిలో ఆరు నెలలు బంధించింది భార్య. తలకు గాయమై రక్తం కారుతున్నా భార్య మనసు కరగలేదు. భర్తకు బయటవారితో సంబంధం లేకుండా అతడి నుంచి ఫోన్ తీసుకుని తలుపులు మూసివేసింది. ఇది జరిగి ఆరునెలలు కావస్తున్నా పక్కవారికి కూడా తెలియకుండా జాగ్రత్త పాటించింది. 
 
వివరాల్లోకి వెళితే... సఖినేటిపల్లి గ్రామానికి చెందిన కొక్కిరిగడ్డ సత్యనారాయణకు అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన సూర్యకుమారితో 2003లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అత్తగారింటికి ఇల్లరికం వచ్చిన సత్యనారాయణ ఉపాధి కోసం సౌదీ వెళ్లి అదే గ్రామంలో ఇల్లు కట్టుకుని ఇంటివద్దే ఉంటూ మద్యానికి బానిస అవడంతో సత్యనారాయణకు, భార్య సూర్యకుమారికి గొడవలు మొదలయ్యాయి. 
 
సత్యనారాయణ బంధువులకు ఆయన పరిస్థితిపై చుట్టుప్రక్కల వారు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. భార్య సూర్యకుమారిని బంధువులు నిలదీస్తే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారనే సమాధానం చెప్పింది. ఐతే జనవరి 11న రాత్రి సమయంలో పిల్లలు ఉండగానే తన భార్య లైట్లు ఆర్పి తీవ్రంగా కొట్టి దాడి చేసిందని బాధితుడు పోలీసుల వద్ద వాపోయాడు.