శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 28 జులై 2021 (15:49 IST)

తొలి రాత్రి భార్యకు భర్త ట్విస్ట్, ట్యాబ్లెట్లు వేసుకుని వింత ప్రవర్తన

తొలి రాత్రి శోభ‌నానికి సిద్ధం కావాల్సింది పోయి, భ‌ర్త వింత‌గా ప్ర‌వ‌ర్తించి భార్యకు ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వ‌య‌సులో కోరిక‌లే ఉండొద్ద‌న్నాడు... ఆ వింత ప్రవర్తన చూసి కొత్త పెళ్ళి కూతురు గొల్ల‌ుమంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన మహిళకు ఎదురైన ప‌రిస్థితి ఇది.
 
వరుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. ఓ యువతికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఇంతలోనే వధువుకు షాకయ్యే విషయం తెలిసింది.. తొలి రాత్రి రోజే తన భర్త వింత ప్రవర్తనతో అవాక్కయ్యింది. అతడి గురించి ఆరా తీస్తే షాకయ్యే విషయాలు తెలిశాయి.. దీంతో అత్తింటివారు తనను మోసం చేశారని పోలీసుల్ని ఆశ్రయించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
 
గుంటూరు జిల్లా నర్స రావుపేటకు చెందిన ఈ మహిళ తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన యువతితో వివాహం జరిపించారు. కట్నకానుకలు కూడా ఇచ్చారు. అయితే వరుడి తల్లి తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్ జరగాలని అత్త ఒత్తిడి చేసింది. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. తొలి రాత్రి యువకుడు వింత ప్రవర్తనతో యువతి అవాక్కైంది. 
 
భర్త ఆమె దగ్గరకు వచ్చిఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదంటూ, టాబ్లెట్ వేసుకొని నిద్రపోయాడు. భర్త మూడు రోజులు అలాగే చేశాడు.. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. భర్తను నిలదీసింది.. భార్య, భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని, మంచి స్నేహితులుగా ఉందామని భర్త షాకిచ్చాడు. భర్త దెబ్బకు కంగుతింది.. అదే రోజు అతడు మింగే టాబ్లెట్లు అయిపోగా.. అవి వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ చెప్పడంతో యువతి షాకయ్యింది. భర్త లోపాలను ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.
 
వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే, తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. తన కుమారుడికి వైద్యం చేసే డాక్టర్ను అడగమని చెప్పింది.. రిటైర్ అయిన ఓ వైద్యుడికి ఫోన్ ఇచ్చింది. ఆ యువతి వైద్యుడిని ప్రశ్నించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ యువకుడికి మానసిక స్థితి సరిగాలేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పడంతో అవాక్కైంది.
 
వరుడికి ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నా మభ్యపెట్టి ఎందుకు పెళ్లి చేశారని తన అత్త యువతి ప్రశ్నించింది. ఆమె గొడవపెట్టుకొని క తమపై బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమను మోసం చేసిమానసిక రోగితో పెళ్లి చేసి మోసగించిన అత్త, భర్త పెళ్లిళ్ల మధ్యవర్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.