బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (15:14 IST)

షార్ట్ ఫిల్మ్ తీయాల‌ని కెమెరాలు తెప్పించి... బెజ‌వాడ కేటుగాళ్ళు!

విజయవాడలో ఘరానా మోసం జ‌రిగింది. షార్ట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాదు నుండి  కెమెరాలను విజయవాడ పిలిపించిన కేటుగాళ్లు చివ‌రికి ఆ కెమెరాల‌తో ఉడాయించారు. హైదరాబాదు కమలాపురి కాలనీ నుండి కెమెరాలతో విజయవాడ వచ్చిన కెమెరామెన్ కేతవత్ దీనితో హ‌తాశుడయ్యాడు. 
 
ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్ ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని ఓ హోటల్ కు తీసుకువెళ్ళారు. కెమెరామెన్ ను భోజనానికి పంపి హోటల్ నుండి 20 లక్షల కెమెరాలతో ఉడాయించారు. 
ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని పోలీసులకు బాదితుడు కేతవత్ ఫిర్యాదు చేశాడు. 
 
విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన  బాధితుడు త‌న కెమేరాలు ఇప్పించాల‌ని వేడుకుంటున్నాడు. కేసు నమోదు చేసి హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసును గవర్నర్ పేట పోలీసులు  ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా నేరాలు జరిగాయని చెబుతున్న బాధితులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.