సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (10:17 IST)

వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా వున్నాడని ఉరేసింది.. ఎక్కడంటే?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివరాంపల్లిలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. వివరా

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివరాంపల్లిలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా, కొడంగల్‌ మండలం, లింగంపల్లికి చెందిన ఆనంద్‌(32)కు హైదరాబాద్ పురానాపూల్‌కు చెందిన మహేశ్వరితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. 
 
హైదరాబాదులో కుక్‌గా పనిచేస్తున్న ఆనంద్ శివరాంపల్లిలో వుంటున్నాడు. ఇక ఆనంద్ భార్య మహేశ్వరికి గంధంగూడకు చెందిన డ్రైవర్‌ అంజూతో ఏర్పడి పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారి అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మహేశ్వరి రెండు నెలల కిందట ప్రియుడి సాయంతో భర్త మెడకు ఉరేసి హత్య చేసింది. 
 
అయితే మృతుడి సోదరుడు కాశప్ప ఆనంద్‌కు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా కలవకపోవడంతో మే 5న వారి ఇంటికి  వచ్చాడు. మహేశ్వరి ఒక్కతే కనిపించడంతో ఆనంద్‌ విషయం ఆరా తీశాడు. మూడు రోజుల క్రితం పనికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన అతను ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పింది. దీంతో కాశప్ప రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భార్య మహేశ్వరి, ఆమె ప్రియుడు ఆనంద్‌ను హతమార్చినట్లు తేలింది. దీంతో మహేశ్వరి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.