మద్యం సేవించాక కొత్తిమీర రసం తాగితే...

Last Updated: ఆదివారం, 21 జులై 2019 (14:46 IST)
మద్యంబాబులు సరికొత్త ఎత్తుగడ వేశారు. పీకల వరకు మద్యం సేవించినా బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త టెక్నిక్ అనుసరిస్తున్నారు. ముఖ్యంగా, మద్యం సేవించిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిమ్మరసం లేదా కొత్తిమీర రసం తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరని గట్టిగా భావిస్తున్నారు.

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పోలీసులు రోడ్లపై కనిపిస్తే చాలు... మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తున్నారు.

వాస్తవానికి గతంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారని కనిపిస్తే, మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తుంటారు. మరికొంత మంది మాత్రం మద్యం సేవించిన తర్వాత నిమ్మరసం లేదా కొత్తిమీర రసం సేవిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరన్నది వారి నమ్మకం. ఆ నమ్మకంతో పోలీసుల ముందుకు వెళ్లి, అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ కారణంతోనే మే నెలలో అత్యధికులు పట్టుబడినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ జ్యూస్‌లతో మద్యం తాగినట్టు వాసన రాకపోవచ్చుగానీ, 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 గ్రాములకు మించిన ఆల్కహాల్ ఉంటే పట్టేస్తామని పోలీసులు అంటున్నారు. మందు కొట్టిన తర్వాత ఏ జ్యూస్ తాగినా, పాన్, పాన్ మసాలాలు నమిలినా అది శ్వాస పరీక్షను ప్రభావితం చేయబోదని హెచ్చరిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :