Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌కు ముగ్గురు భార్యలున్నా ఫర్లేదు.. నేను నాలుగో భార్యగా ఉంటా...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:37 IST)

Widgets Magazine
pawan kalyan-smile

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు ఓ మహిళ సిద్ధమైంది. పవన్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెపుతోంది. ఆ మహిళ ప్రస్తుతం హైదరాబాద్ బేంగంపేట్‌లోని కొలంబస్ ఆసుపత్రిలోని సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతోంది. 
 
దీనిపై సైకియాట్రిస్టు నరేష్ వడ్లమాని మాట్లాడుతూ, ఐదారేళ్ల క్రితం ఆ యువతి (24) ని ఆమె తల్లితండ్రులు చికిత్స కోసం తన దగ్గరకి తీసుకొచ్చారని తెలిపారు. ఆమె సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌‌కి వీరాభిమాని. అప్పట్లో పవన్ కల్యాణ్ ఆమె పని చేసే మల్టీనేషనల్ కంపెనీకి అనుకోకుండా వెళ్లడం, అక్కడ ఆ అమ్మాయిని చూసి నవ్వడం జరిగందట. దీంతో అప్పటినుంచి పవన్ కల్యాణ్ తనను ప్రేమిస్తున్నాడనే భ్రమలో ఆమె పడిపోయింది. 
 
పైగా, అప్పటి నుంచి వింతగా ప్రవర్తించడమేకాకుండా 'నేనే కాదు, పవన్‌ కల్యాణ్‌ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను వదిలేస్తే వాళ్లింటికి వెళ్తాను' అంటూ గోల చేయడం ఆరంభించింది. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు వైద్యునివద్దకు తీసుకెళ్లగా, ఆమెను పరీక్షించిన వైద్యులు ఎరొటొమేనియా వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. అపుడు చికిత్స చేయగా ఆమె కోలుకున్నారని చెప్పారు. 
 
అయితే, తీవ్రమైన ఒత్తిడికి గురైతే మాత్రం ఆ సమస్య మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించానని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించామని తెలిపారు. తాము హెచ్చరించినట్టే ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో ఒత్తిడికి లోనై మళ్లీ 'ఎరొటొమేనియా'కు లోనైంది.
 
ఇపుడు మళ్లీ తమవద్దకు ఆ మహిళను తీసుకునిరాగా, 'పవన్‌ కల్యాణ్‌‌కు ముగ్గురు భార్యలున్నా ఫర్వాలేదు నాలుగో భార్యగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు' అని ఆమె అంటోంది. అయితే ఇప్పుడు ఆమెకు మరోసారి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యువకుడు మంటల్లో కాలిపోతుంటే.. వీడియో షూట్

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని ...

news

'బ్లూవేల్‌ ఛాలెంజ్' : బ్లేడుతో నాలుక కోసుకున్నాడు...

సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్. అమాయక ...

news

ఏడేళ్ళ బాలికను రేప్ చేసి చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లాలో కొందరు కామాంధులు పసిమొగ్గపై తమ రాక్షసత్వం ...

news

అమ్మాయిలపై లైంగిక దాడులు... ఈ చెప్పుతో కొడితే..?

అమ్మాయిలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్న తరుణంలో అత్యాచారాలు, లైంగిక దాడుల నుంచి ...

Widgets Magazine