శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (13:59 IST)

పవన్ సీఎం పోస్ట్- చర్చా కార్యక్రమం నుంచి జ్యోతిష్కుడు పరార్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని చెప్పిన జ్యోతిష్కుడు వేణు స్వామి ఓ టీవీ నిర్వహించిన చర్చలో చెప్పారు. అయితే చర్చా కార్యక్రమంలో ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. చర్చలో జ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  సీఎం అయ్యే అవకాశాలు లేవని చెప్పిన జ్యోతిష్కుడు వేణు స్వామి ఓ టీవీ నిర్వహించిన చర్చలో చెప్పారు. అయితే చర్చా కార్యక్రమంలో ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. చర్చలో జనవిజ్ఞానవేదిక నటుడు వేణుమాధవ్, జనసేన కార్యకర్త కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా పవన్, జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కుడు.. ఏపీ సీఎం అయ్యే అవకాశాలు పవన్ కల్యాణ్‌కు లేదన్నాడు. అయితే దీనిపై చర్చా కార్యక్రమానికి వచ్చిన వారు ప్రశ్నించడంతో వాటికి సరైన సమాధానం చెప్పలేక.. అతను పారిపోయాడు.         
                                                                          
పవన్‌కు రాజభోగమే. తప్ప రాజయోగం లేదని వేణు స్వామి చెప్పగా, జనసేన కార్యకర్త కిరణ్ తీవ్రంగా దీన్ని విభేదించారు. ఇక అదే సమయంలో చర్చా కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చిన జనవిజ్ఞానవేదిక సభ్యులు పీవీ రావుస్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. 
 
గతంలో ఆగస్టు 2017 తర్వాత ఇద్దరు గవర్నర్లు వస్తారని, నరహింహన్ వెళ్లిపోతారన్నారు.. ఎక్కడ ఫలించిందని అడిగారు. అయితే వక్తలందరూ అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పలేక వేణు స్వామి షో నుంచి బయటికి వచ్చేశారు.