జనసేనానికి అంతర్జాతీయ పురస్కారం.. ఏంటది?

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:29 IST)

pawan kalyan

సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.
 
పలు రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన వారికి ప్రతి ఏటా ఐఈబీఎఫ్ అవార్డును ఇవ్వడం పరిపాటి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌కల్యాణ్ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు పవన్ కల్యాణ్‌ని ఎంపిక చేసినట్టు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం ప్రతినిధులు పేర్కొన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేరా బాబా సామ్రాజ్యంపై కన్నేసిన హనీప్రీత్... ఆయనతో బిడ్డని కని, భావిచీఫ్‌ని చేయాలని ఎత్తు

హర్యానా రాష్ట్రం, సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సామ్రాజ్యంపై ...

news

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె తండ్రి, సోదరుడికి పంపాడు..

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె ఈ-మెయిల్, వాట్సాప్ నంబర్లకు పంపి వికృతానందం పొందిన ...

news

విద్యార్థి హాజ‌రు రియ‌ల్ టైమ్ గవ‌ర్నెన్స్ లోకి రావాల్సిందే... మంత్రి గంటా

విజ‌య‌వాడ : రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివే ప్ర‌తి విద్యార్థి హాజ‌రు రియ‌ల్ టైమ్ ...

news

ప్రధానమంత్రి 'సౌభాగ్య' పథకం... 3 కోట్ల మందికి ఉచిత విద్యుత్...

ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన ప్రజలకు సోమవారం నాడు ప్రధాన మంత్రి ఓ తీపి కబురు చెప్పారు. దిగువ ...