ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (20:10 IST)

కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ వెళ్లిపోయినా నేను పోను... చింతామోహన్ సంచలనం

కాంగ్రెస్ పార్టీకే ఎంతో పేరుంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వెళ్ళిపోవడానికి సిద్థంగా ఉన్నారు. అయినా ఏం ఫర్వాలేదు. ఎవరు ఉన్నా లేకున్నా మా పార్టీలో నేనుంటా. ఆఖరికి సోనియాగాంధీ వెళ్ళిపోయినా ఫర్వాలేదు అంటూ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎపిలో వరుసగా పార్టీలు మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందులోను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో చింతామోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాయకులను చూసి పార్టీని పెట్టలేదని, ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళే వారిని ఆపేది లేదన్నారు చింతామోహన్. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, మరో రెండునెలల్లో కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు చింతామోహన్.