శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (18:39 IST)

స్వాతంత్ర్యదినోత్సవం.. 771 అడుగుల జాతీయ జెండాతో రోజా ర్యాలీ (వీడియో)

వైకాపా ఎమ్మెల్యే రోజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం రోజా ర్యాలీగా కదిలారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద

వైకాపా ఎమ్మెల్యే రోజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం రోజా ర్యాలీగా కదిలారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ పుత్తూరులో భారీ జెండాతో ఈ ర్యాలీ సాగింది.

ఈ ర్యాలీలో భారీ ఎత్తున వైకాపా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. 771 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ జరిగింది. పుత్తూరులో జరిగిన ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోజా విద్యార్థులను బ్యాగులను అందజేస్తారు.
 
ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలకు, రోజాకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా అఖిల ప్రియపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం, రోజాపై ఆ పార్టీ నేత అగ్ర నేత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంకా సోషల్ మీడియాలో రోజాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వ్యతిరేక వార్తలపై రోజా ఫైర్ అయ్యారు. తాను చనిపోయానంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫొటోలను ప్రచారం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తన రాజకీయ శతృవులు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని రోజా మండిపడ్డారు. తనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని హెచ్చరికలు జారీ చేశారు.