1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (14:50 IST)

నీ కుమార్తె శీలం రేటు రూ.2 వేలు.. ఇందా డబ్బు... గ్రామ పెద్ద తీర్పు

పదో తరగతి చదివే బాలిక శీలానికి ఓ గ్రామ పెద్ద రూ.2 వేలు రేటు నిర్ణయించాడు. ఆ డబ్బులు తీసుకుని ఆస్పత్రిలో చికిత్స చేయంచుకోవాలంటూ ఓ ఉచిత తీర్పునిచ్చాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయి

పదో తరగతి చదివే బాలిక శీలానికి ఓ గ్రామ పెద్ద రూ.2 వేలు రేటు నిర్ణయించాడు. ఆ డబ్బులు తీసుకుని ఆస్పత్రిలో చికిత్స చేయంచుకోవాలంటూ ఓ ఉచిత తీర్పునిచ్చాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తాట్లవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీలాల్‌ తండాలో జరిగింది. తండాకు చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 11న పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గోపాల్‌ మార్గమధ్యలో అడ్డగించి ఇంటి వద్ద దింపుతానని తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత గ్రామ సమీపంలోకి అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆ బాలికను అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. 
 
అక్కడ నుంచి రాత్రి ఇంటికి చేరుకున్న బాలిక ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. శనివారం బాధిత కుటుంబం గ్రామ సర్పంచ్‌ మహేశ్‌కు తెలుపగా నిందితుడిని పిలిపించి విచారించారు. నిందితుడికి విధించిన జరిమానా రూ.2 వేలు తీసుకుని కూతుర్ని ఆస్పత్రిలో చూపించమని సలహా ఇచ్చాడు. దీంతో షాక్‌కుగురైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచ్‌ మహేశ్‌, నిందితుడు గోపాల్‌పై కేసు నమోదు చేశారు.