గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:48 IST)

ఆ పాలు అస్సలు తాగొద్దండీ..

పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇత

పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలట. లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలను తాగడం వల్ల బ్లూసిల్లోసిస్‌తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు మనుషులకు సోకుతాయట. కర్ణాటక రాష్ట్రంలో పశువుల్లో బ్లూసిల్లోసిస్‌తో పాటు గాలికుంటు వ్యాధి, నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను గుర్తించారు. 
 
వైరస్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తుండగా.. గొర్రెలు ఈ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరిగించిన పాశ్చరైజేషన్ చేసిన పాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ వైరస్ నశిస్తుందట. కాబట్టి వేడి చేసిన పాలను మాత్రమే తాగాలట. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందట. అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. పశువులకు వ్యాక్సిన్‌లు వేసినా ఉపయోగం లేదంటున్నారు వైద్యులు. అందుకే పచ్చిపాలను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోకుండా వేడి చేసిన వాటినే తీసుకోవాలట.