గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 4 జులై 2019 (20:06 IST)

ట్విట్టర్లో నారా లోకేష్... జగన్ గారూ.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ఇటీవలి కాలంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇలా వున్నాయి. ''ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్‌లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనం నిర్మించుకోవచ్చు.
 
సరదాగా కొంత సమయం గడపడానికి బెంగుళూరులో ప్యాలస్ నిర్మించుకోవచ్చు. అమరావతిలో నివాసం కోసం రాజ భవంతి కట్టుకోవచ్చు.పేదవాడు మాత్రం ఎప్పుడూ కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలోనే ఉండిపోవాలి. 
 
ప్రజాధనంతో పేదవాడికి అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు కట్టడం తప్పు అని మీరు అనడం సబబు కాదు జగన్ గారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇకనైనా సాక్షి పేపర్ చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి'' అంటూ ట్వీట్ చేశారు.