గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:16 IST)

Jagananna Vidya Deevena డబ్బు తల్లుల ఖాతాల్లో కాదు కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లోకి...

జగనన్న విద్యా దీవెన పథకం కింద జగన్ సర్కారు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజును నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బును కొంతమంది కళాశాలలకు సక్రమంగా కడుతుండగా మరికొందరు సొంత ఖర్చులకు వాడుకుని విద్యార్థుల ఫీజులు కట్టకుండా తాత్సారం చేస్తున్నారు.
 
ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యాలు ఏమీ చేయలేని స్థితి నెలకొనడంతో దీనిపై న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేసారు. విద్యార్థులకు అందిస్తున్న ఫీజును తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని విజ్ఞప్తి చేసారు.
 
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, విద్యా దీవెన డబ్బును నేరుగా కాలేజీ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. దీనితో ఇక తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ కాదు. మరి ఈ తీర్పుపై జగన్ సర్కార్ మళ్లీ అప్పీల్ చేస్తుందా లేదా చూడాల్సి వుంది.