సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (16:38 IST)

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం

తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం  చెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడ పల్లెకు చెందిన వీర జవాన్  సాయితేజ మృత దేహం క‌ర్నాట‌కు చేరుకుంది. బెంగ‌ళూరు ఎయిర్ బేస్ క్యాంపున‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి జ‌వాన్ సాయితేజ మృత‌దేహం చేరుకుంది. సైనిక లాంఛ‌నాల‌తో మృత‌దేహాన్ని బెంగ‌ళూర్ బేస్ క్యాంప్ లోని మార్చురీకి త‌ర‌లించారు. రేపు ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట (మ) ఎగువరేగడు గ్రామంలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం అప్పగించ‌నున్నారు.
 
 
వీర జవాన్  సాయితేజ మృత దేహం ఆదివారం ఉదయం వారి  స్వగ్రామానికి చేరుకుంటుందని, చిత్తూరు   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం రేగడపల్లెలో అధికార లాంఛనాలతో దహన క్రియలు జరుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఉద‌యం ఇక్క‌డికి మృత‌దేహం చేరుతుంద‌ని చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.