వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా : వీవీ లక్ష్మీనారాయణ  
                                       
                  
                  				  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ -ఏపీటీఏ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ జరిగింది. ఇందులో ఆయన పాల్గొని పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. 
				  											
																													
									  
	 
	ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తానా లేక కొత్త పార్టీ స్థాపిస్తానా? మరో రాజకీయ పార్టీలో చేరుతానా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. 
				  
	 
	కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే పేద విద్యార్థుల్లో అర్హులైన వారిని ఆదుకునేందుకు ఏపీటీఏ ఉపకార వేతనాలు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.