బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (21:51 IST)

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కలశ జ్యోతి ఉత్సవము

29-12-2020 (మార్గశిర పౌర్ణమి) సాయంత్రం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంబోట్ల దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులైన పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు దంపతుల వారు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
 
అనంతరం గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు,  పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు దంపతుల వారు, పాలకమండలి సభ్యులు శ్రీ కె.వెంకట రమణ(బాలా), శ్రీమతి ఎం.అంబిక, శ్రీమతి బి.సుబ్బాయమ్మ గారి ఆధ్వర్యంలో కలశజ్యోతుల ఉత్సవము సత్యనారాయణపురం లోని శివరామ నామ క్షేత్రం నుండి ప్రారంభమయి, గాంధీనగర్ రోడ్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్, చల్లపల్లి బంగ్లా, పొలిసు కంట్రోల్ రూము, ఫ్లైఓవర్, వినాయక స్వామీ దేవస్థానము, రధం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ నకు చేరి, కనకదుర్గా నగర్ నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశం నందు భక్తులు అమ్మవారికి జ్యోతులు సమర్పించడము జరిగినది.
 
అనంతరం భక్తులు మహామండపం మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని అమ్మవారి దర్శనము చేసుకోన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ గారు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు, సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది, భవానీ మాలాధారులు భక్తులు పాల్గొన్నారు.