గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (12:47 IST)

ప్రేమించలేదనీ యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది...

తనను ప్రేమించలేదని ఓ యువతి గొంతు నిలువునా కోసేశాడో ప్రేమోన్మాది. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో జరిగింది. అదీ కూడా జిల్లా కలెక్టరేట్ ఎందుటే. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ వివరాల

తనను ప్రేమించలేదని ఓ యువతి గొంతు నిలువునా కోసేశాడో ప్రేమోన్మాది. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో జరిగింది. అదీ కూడా జిల్లా కలెక్టరేట్ ఎదుటే. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కరీంనగర్ జిల్లా రామగుండంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన రసజ్ఞ(22) అనే యువతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న స్థానిక మీసేవా కేంద్రంలో పనిచేస్తూ వస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం యధావిధిగా విధులకు వెళ్లింది. 
 
ఆ తర్వాత కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, రసజ్ఞతో మాట్లాడాలని పిలవడంతో బయటకు వచ్చింది. అపుడు తనను ప్రేమించాలని బలవంతం చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. 
 
ఆ తర్వాత క్షణాల్లో ఆమె గొంతుకోసి అక్కడి నుండి పరారీ అయ్యేందుకు ప్రయత్నానిచ్చాడు. అయితే, అక్కడ ఉన్న స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కొడవలితో యవతి గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.