ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (22:33 IST)

పవన్ కళ్యాణ్ 5వ తరగతి విద్యార్థి కంటే హీనం... మూర్ఖుడు... మహేష్ 'కత్తి' షాకింగ్

అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి బాగా కత్తి కట్టాడనే విమర్శలు వస్తున్నాయి. కత్తి మహేష్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకం చూస్తే తనకు అసలు పవన

అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి బాగా కత్తి కట్టాడనే విమర్శలు వస్తున్నాయి. కత్తి మహేష్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకం చూస్తే తనకు అసలు పవన్ తీరు ఏంటా అని ఆలోచనలో పడిపోయినట్లు తెలిపారు. ఇజం పుస్తకాన్ని ఐదవ తరగతి విద్యార్థి కంటే హీనంగా రాసి తికమక పెట్టారంటూ విమర్శించారు.
 
ఈ ఇజం పుస్తకంపై బాగా పరిశోధన చేస్తే తనకు ఓ విషయం బోధపడిందనీ, ప‌వ‌న్ తను తిక‌మ‌క ప‌డటమే కాకుండా ఆయ‌న అభిమానుల‌ను, ప్ర‌జ‌ల‌ను కూడా తిక‌మ‌క పెడుతున్నారని అన్నారు కత్తి. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే పవన్ అనే ఓ మూర్ఖ‌త్వాన్ని ఆయ‌న అభిమానులు నెత్తిన వేసుకుని తిరుగుతున్నార‌ంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ ఎవరో తన వెనక వుండి చేయిస్తున్నవి కావనీ, పవన్ ఇజం చూశాక మాత్రమే తను ఇలా మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.