శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 7 జులై 2018 (20:01 IST)

కత్తి మహేష్ సరిగ్గానే చెప్పాడు.. రాముడు అలాంటివాడే : కత్తి ఓబులేసు

దేవుడనేది ఒక నమ్మకం. కోట్లాదిమంది ప్రజల విశ్వాసం. అది వారి సంస్కృతి, సాంప్రదాయాల్లో మిలితమై ఉంటుంది. దేవుడు ఉన్నాడా. లేదా అనేది పెద్ద చర్చ. దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇంతటి భిన్నత్వంలోను, భేధాభిప్రాయాల నడుమ ఎవరి నమ్మకాలను వారు గౌరవించుకోవ

దేవుడనేది ఒక నమ్మకం. కోట్లాదిమంది ప్రజల విశ్వాసం. అది వారి సంస్కృతి, సాంప్రదాయాల్లో మిలితమై ఉంటుంది. దేవుడు ఉన్నాడా. లేదా అనేది పెద్ద చర్చ. దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇంతటి భిన్నత్వంలోను, భేధాభిప్రాయాల నడుమ ఎవరి నమ్మకాలను వారు గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి. ఇప్పటికే కులాలు, మతాల పేరుతో దుమ్మెత్తి పోసుకుంటున్న జనాలు దేవుడిని ఆధారంగా చేసుకుని ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ పెడదోరణిల ప్రభావం ఎలా ఉండబోతోంది. 
 
ఆత్మ, పరమాత్మ. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంటుంది. అది మానవుడికి జీవాధారమైనది. ఈ ఆత్మలన్నింటినీ నడిపించేది పరమాత్మే అని నమ్ముతారు కొందరు. అందుకే ఆ పరమాత్మనే దైవంగా భావిస్తారు. వారి వారి కులాలను, మతాలను బట్టి వివిధ రూపాల్లో దేవున్ని పూజిస్తూ ఉంటారు. ఎవరు ఏ దేవున్ని పూజించినా దేవుడు ఒక్కడే అన్నది విశాల దృక్పథం కలిగిన భావన. దాన్ని అందరూ గౌరవిస్తారు. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుళ్ళను ఆరాధిస్తుంటారు. ఇది అనాది కాలంగా వస్తూ ఉంటుంది. 
 
ఈమధ్య కాలంలో కులాలు, మతాలకు మధ్య చిచ్చు రేగుతుండడంతో ఆ రొచ్చిలోకి దేవుళ్ళను కూడా లాగుతున్నారు. పురాణ గ్రంథాలలో తెలుపబడిన దేవుళ్ళపైన విమర్సలు చేస్తున్నారు. వీటిని ఆ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో గొడవలు చెలరేగుతున్నాయి. తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ రాముడిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని యావత్ హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏకపత్నీవ్రతుడిగా, పరిపాలనాధ్యక్షుడిగా పేరుగాంచిన రాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాయి హిందూ సమాజం. 
 
తాము నమ్మే గ్రంథాలను, తాము నమ్మే దేవుళ్ళను అవమానకరంగా మాట్లాడడం ఏంటంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కత్తి మహేష్ పై కేసులు కూడా పెట్టారు. అయితే కత్తి మహేష్ మాత్రం ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నాడు. ఆధారాలతో తాను ఈ వ్యాఖ్యలను చేస్తున్నానని చెప్పుకొస్తున్నాడు. విశాల భావాలు కలిగిన ప్రస్తుత సమాజంలో సంకుచిత భావాలు కలిగిన రాముడు ఎలా దేవుడు అవుతాడంటూ ప్రశ్నిస్తున్నాడు. 
 
అయితే తన కొడుకు వ్యాఖ్యల పట్ల కత్తి మహేష్‌ తండ్రి కత్తి ఓబులేసు కూడా సమర్థిస్తున్నాడు. గతంలో రామాయణం విషవృక్షమంటూ పుస్తకాలు రాసిన వారు కూడా ఉన్నారని, అలాంటిది ఈరోజు తన కొడుకు చేసిన వ్యాఖ్యలను రార్థాంతం చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తన కొడుకు అన్ని ఆధారాలతోనే మాట్లాడుతారని, అతని మాటలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. అయితే నిజాలు మాట్లాడినప్పుడు కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఎదుర్కొనడానికి తాను సిద్థంగా ఉన్నానన్నారు. తన కొడుకు చెప్పినట్లుగా రాముడు దగుల్భాజీనేనని, సీత రాముడి కన్నా రావణుడి దగ్గర ఉనుంటేనే బాగుండేదని కత్తి ఓబులేసు చెప్పారు. 
 
కత్తి మహేష్ వ్యాఖ్యలతో హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అయితే కత్తి మహేష్ మాత్రం ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పటితో పులిస్టాప్ పడే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు.