నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి కిరణ్‌... ముహూర్తం ఉదయం 11.30

శుక్రవారం, 13 జులై 2018 (08:55 IST)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
nallari kiran
 
రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయంతో విభేదించిన కిరణ్‌.. 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే యేడాది మార్చి 12న జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. కానీ, ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఈ పార్టీ తరపున ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. 
 
దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంటే గత నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏడాది కింద రాహుల్‌ గాంధీతో ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలంటే.. రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కిరణ్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. అపుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావించారు. కానీ ఆయన దూరంగానే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు. అపుడు పార్టీలోకి రావాలని ఉమెన్ చాందీ ఆహ్వానించారు. రాహుల్‌తో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లూ చేసి, కిరణ్ పార్టీలో చేరే ముహూర్తాన్ని కూడా ఆయనే ఖరారు చేశారు. దీనిపై మరింత చదవండి :  
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాహుల్ చేరిక Join Delhi Congress Rahul Gandhi Kiran Kumar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

అవినీతిలో మోడీ ప్రభుత్వానిది నెంబర్ 1 ర్యాంకా?

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రస్థానం ...

news

అది పాడింది కత్తి మహేషేనా...? శ్రీరాముడి పాట (video)

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించిన కత్తి మహేష్ హైదరాబాద్ నగర బహిష్కరణకు ...

news

పవన, సోలార్ విద్యుత్పుత్తిలో మనమే ఫస్ట్... కళా వెంకట్రావు

అమరావతి : పవన, సోలార్ విద్యుత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ...

news

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఓవర్.. ఏమిస్తావని.. కౌగిలించుకోమన్నాడు..

ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసు ...