అలా చేస్తే రాహుల్ ప్రధాని అవుతారు : సోనియాతో జేసీ దివాకర్

శుక్రవారం, 6 జులై 2018 (14:30 IST)

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు, రాహుల్‌కు పెళ్లి కావాలంటే ఆయన తల్లి సోనియా గాంధీకి కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఓ చిన్నపాటి సలహా ఇచ్చారట. ఈ చిట్కా కూడా జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో చెప్పారట. ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
jc diwakar reddy
 
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు కావాలని, ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంచి అమ్మాయిని చూసి, రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని సోనియాకు సూచించినట్లు జేసీ తెలిపారు. యూపీలో బ్రాహ్మ‌ణ‌ కమ్యూనిటీదే పైచేయిగా నడుస్తోందని, అందుకే బ్రాహ్మ‌ణ‌ కులానికి చెందిన పిళ్లను రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయమని గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు. 
 
కానీ తన సలహాలు, సూచనలను సోనియా పట్టించుకోలేదని, విని మిన్నకుండిపోయారనీ చెప్పారు. జూలై 4న జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాయ్‌బరేలీ ఎమ్మెల్యే సదర్ అదితి సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌కు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే రాహుల్ తనకు సోదరుడిలాంటి వాడని ఆమె ఆ వార్తల్ని కొట్టిపారేశారు. దీనిపై మరింత చదవండి :  
కాంగ్రెస్ సోనియా గాంధీ బ్రాహ్మణ Brahmins జేసీ దివాకర్ రెడ్డి Congress Sonia Gandhi Rahul Gandhi Jc Diwakar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మను చికిత్స కోసం విదేశాలకు తరలించాలని మొత్తుకున్నా.. ప్చ్.. పట్టించుకోలేదు!

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్య సేవల కోసం ...

news

నా పిల్లల తండ్రి పవన్ కళ్యాణ్ గురించి నేను అలా మాట్లాడాలా? స్టుపిడ్ ఫెలో: రేణూ దేశాయ్

ట్విట్టర్ ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని మూసేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్టులు చేస్తున్న రేణూ ...

news

ముగ్గురు కామాంధులు ఓ మహిళను ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ ...

news

కుటుంబ కలహాలు... భార్యను పాశవికంగా వేటకొడవలితో నడిరోడ్డుపైనే?

తమిళనాడులో పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త పాశవికంగా హతమార్చాడు. ...