శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (09:12 IST)

కర్నూలు డాక్టర్‌ ప్లాస్మా దానం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిజిహెచ్‌ హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గెమరాజు అచ్యుత ప్లాస్మా ఇచ్చారు. గైనిక్‌ వార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో మే 6న ఆమె కరోనా బారిన పడ్డారు.

మే 23న కరోనాపై విజయం సాధించి డిశ్చార్జి అయ్యారు. కర్నూలు వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌, రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి, తండ్రి గణపతిరావు ప్రోద్భలంతో ప్లాస్మా ఇచ్చేందుకు అచ్యుత సిద్ధమయ్యారు.

ప్లాస్మాను దానం చేయడం పట్ల జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అచ్యుతకు అభినందనలు తెలిపారు.