గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (10:44 IST)

ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం : కర్నూలు నగర మేయర్

by ramaiah
తమ పార్టీకి చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర బహిరంగ సభకు జనాలు లేక వెలవెలబోయాయంటూ కొన్ని పత్రికలు వార్తలను ప్రచురించాయని, ఆ పత్రికలకు చెందిన విలేకరుల వీపులు వాయగొడతామంటూ కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరికలు జారీచేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు కర్నూలులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
వైకాపా మంత్రులు ఇటీవల సామాజిక న్యాయభేరీ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సుయాత్ర కర్నూలుకు వచ్చినపుడు జనాలు కనిపించలేదు. దీన్ని కొన్ని పత్రికలు ఫోటోలు తీసి వార్తల రూపంలో ప్రదర్శించాయి. 
 
దీనిపై కర్నూలు మేయర్ బీవై రామయ్య స్పందిస్తూ, బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినపుడు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని, దీంతో ప్రజలు నీడ చాటుకు వెళితే సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు.