సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (20:36 IST)

వర్రా రవీంద్రా రెడ్డిని అరబ్ దేశాల్లో అయితే రోడ్లపై కొట్టి చంపేస్తారు : డీఐజీ ప్రవీణ్ (Video)

koya praveen
వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి మాట్లాడిన భాష చూస్తే అరబ్ దేశాల్లో అయితే రోడ్లపై కొట్టి చంపేస్తారని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత తదితులపై అసభ్యకర పోస్టులను పెట్టిన కేసులో గత రెండు మూడు రోజులుగా పరారీలో ఉన్న వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆదివారం మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఈ కేసులో వర్రా రవీందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను కోయా ప్రవీణ్‌, కడప ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మీడియాకు వివరించారు.
 
'నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉంది. అరబ్‌ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయి. సీఎం, డిప్యూడీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారు. వర్రా రవీందర్‌రెడ్డి గతంలో భారతి సిమెంట్స్‌లో పని చేశాడు. మరో ఇద్దరు కూడా వైకాపా సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారు. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను వైకాపాకి అనుకూలంగా వినియోగించుకున్నారని నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారు. 
 
గతవారం రోజులుగా సోషల్‌మీడియా సైకోలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు. సోష‌ల్‌మీడియాలో వీరు మాట్లాడిన భాష చూస్తే అర‌బ్ దేశాల్లో రోడ్ల‌పై కొట్టి చంపేస్తారన్నారు. వర్రా రవీంద్రరెడ్డి మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా పోస్టులు పెట్ట‌డంలో సిద్ధ‌హ‌స్తుడని, ఇదంతా రాష్ట్రవ్యాప్తంగా ఆర్గనైజ్డ్‌గా చేసిన వ్యవహారమన్నారు. వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ ఆధ్వ‌ర్యంలో సోషల్‌మీడియాలో బూతు పురాణం ప్రారంభించారని తెలిపారు. 
 
ఇప్పటివరకు 40 సోషల్‌ మీడియా టీమ్‌లను గుర్తించామని, 40 యూట్యూబ్ చానళ్ళు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. సజ్జల భార్గవ్ ఆధ్వ‌ర్యంలో 400 మంది పని చేశారని, పంచ్ ప్రభాకర్, వెంకటేష్ బాడీ, బేతంపూడి నాని, కీసర రాజశేఖర రెడ్డి, హరికృష్ణా రెడ్డి కల్లం వంటి వారిని గుర్తించినట్టు తెలిపారు. వర్రా రవీంద్రరెడ్డిని కోర్టులో హాజరుపరిచి పోలీసు కస్టడీకి  కోరుతామని తెలిపారు.