రాజకీయ సన్యాసం కొనసాగిస్తానంటున్న ఆంధ్రా ఆక్టోపస్

వాసు| Last Updated: మంగళవారం, 12 మార్చి 2019 (16:36 IST)
సాధారణంగా రాజకీయ నాయకులంటే మాట మీద నిలబడడం చాలా తక్కువ... ఈ కోవలో కూడా లగడపాటి కొత్త ఒరవడిని సృష్టించారనే చెప్పుకోవాలి. వివరాలలోకి వెళ్తే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి తన రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తాననీ.. ఏ పార్టీలోనూ చేరబోననీ, వ్యాపారాలు చేసుకుంటానని ప్రకటించారు.

మంగళవారం కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. గత ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపార కార్యకలాపాల్లో మునిగి ఉన్న ఆయన... ఇప్పడు సార్వత్రిక ఎన్నికలు రావడంతో తన రాజకీయ సన్యాసానికి సన్యాసం ఇచ్చేసి ఏదైనా పార్టీలో చేరి పోటీచేస్తారా అన్న దానిపై అంతటా ఆసక్తి ఉండేది. అయితే ఈ విషయంపై ఆయన మంగళవారం క్లారిటీ ఇస్తూ రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :