సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 18 జనవరి 2020 (14:34 IST)

నా గుండె పచ్చిగా వుంటుంది: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి

చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు జాతికి ఇది దుర్దినం అన్నారు. ఎన్నో గుండెలు ఆగిపోయిన రోజు అని గుర్తుచేసుకున్న ఆమె, అన్యాయంగా అధికారంలో నుంచి తొలగించి, గుండెపోటుతో చనిపోయేలా చేసిన రాజకీయాలు ఇంకా కంటి ముందు కనిపిస్తున్నాయన్నారు. 
 
అందుకు కారణమైన వారు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు... ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్న ఆమె.. చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడిన వేదన నా ఒక్కదానికే తెలుసన్నారు. ఇప్పటికి ఈ రోజు నివాళులర్పిస్తున్న సమయంలో నా గుండె చాలా పచ్చిగా వుంటుంది అన్నారు.