తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి
శ్రీవారి సేవ కోసం తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడిన సుమన్ కన్నుమూశాడు. భవనంపై నుంచి కింద పడిన తర్వాత అతడిని చికిత్స్ కోసం స్విమ్స్ ఆసుపత్రి కి తరలించారు.
చికిత్స పొందుతున్న సుమన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమన్‍ను పరామర్శించారు టీటీడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్.. మృత దేహన్ని స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.