అమరావతిలో నిర్భయ ఘటన.. ఏకాంతంగా వున్న ప్రేమజంట.. యువతిపై?

gang rape
Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:39 IST)
అమరావతిలో దారుణం చోటుచేసుకుంది. ఏకాంతంగా వుండిన ప్రేమ జంటపై దుండగులు దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసిన దుండగదులు.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి అత్యాచారానికి ప్రతిఘటించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవలూరు ఉడా టౌన్‌షిప్‌లో ఈ దుర్ఘటన జరిగింది. 
 
తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాస్ (26), అంగడి జ్యోతి (24)లు ప్రేమలో వున్నారు. సోమవారం వీరిద్దరూ టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకంతంగా ఉన్నారు. రాత్రి తొమ్మిదిగంటలకు ఏకాంతంగా వున్న ఈ ప్రేమ జంటపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. 
 
ఆపై యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన యువతిపై దుండగులు దాడి చేశారు. దీంతో గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇంకా యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో.. జ్యోతి దారుణ హత్యాచారం వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనకు ముందు శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి కొందరు స్నేహితులకు ఫోన్ కాల్స్ వెళ్లాయని, వారే అత్యాచారానికి పాల్పడ్డారని, శ్రీనివాసరావుపై అనుమానం రాకుండా ఉండేందుకు అతన్ని కూడా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
కాగా, జరిగిన ఘటనపై స్పందించిన జ్యోతి సోదరుడు, తన చెల్లిని శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి చంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సోదరి శ్రీనివాసరావును ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా అడుగుతుంటే కాలయాపన చేస్తూ వచ్చాడని, చివరికిలా దారుణానికి ఒడిగట్టారని ఆరోపించాడు.దీనిపై మరింత చదవండి :