ప్రేమికుల మధ్య గొడవ, ఉరి వేసుకున్న ప్రియుడు, మూడో అంతస్తు నుంచి దూకేసిన ప్రియురాలు

lovers suicide
వి| Last Modified మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (15:45 IST)
ప్రేమికుల మధ్య జరిగిన గొడవ ఇరువురు ప్రాణాలకు ముప్పుగా మారింది. వివరాలు చూస్తే... విశాఖపట్నం మధురవాడలో వైఎస్సార్ నగర్ కాలనీలో బ్లాక్ నెంబర్ 13లో నివశించే అరుణ్ కుమార్(23) ఓ పుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పనిలేక ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నాడు.

అరుణ్ అదే కాలనీకి చెందిన అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. సోమవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అరుణ్ కుమార్ ఇంట్లోనే ప్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిత తాను నివాసం ఉంటున్న భవనం మూడో అంతస్తు నుండి కిందకు దూకేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

గమనించిన స్థానికులు తీవ్రగాయాలపాలైన అనితను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :