మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:18 IST)

గణనాథుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వినాయక చవితి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కోవిద్ నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయోధ్య నగర్ లోని నవభారత్ అపార్ట్ మెంట్ లో శనివారం జరిగిన వేడుకలలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏ మంచి కార్యం చేపట్టాలన్నా.. తొలి పూజ విఘ్ననాథునితోనే మొదలవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు అన్నారు. కులాల, మతాలకతీతంగా భక్తులు కొలిచే దైవం వినాయకుడని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం తలపెట్టిన కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతమవ్వాలని.. ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గణనాథున్ని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. వినాయకుని కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో పయనించాలని.. అప్పుడే సమాజం సుఖ:సంతోషాలతో ఉంటుందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, వెంకటేశ్వరరెడ్డి, నాగు, శ్యామ్, రమేష్, దుర్గాప్రసాద్, విజయ్ కుమార్, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.