మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (22:22 IST)

కన్నతల్లిని చిత్ర హింసలకు గురిచేసిన కన్నకొడుకు..

Son
Son
కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్నతల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి లక్ష్మీని కింద పడవేసి కాళ్లతో తన్నుతున్న వీడియో హృదయాన్ని కలిచివేస్తుంది. 
 
ఈ వీడియోలో కొడుకు తల్లి పీకపై కాళ్లు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు. తాగిన మత్తులో ఈ యువకుడు తన తల్లిని ఇలా చిత్ర హింసలకు గురిచేయడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. 
 
సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.