శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (15:31 IST)

కరోనా సోకిందని కట్టుకున్న భార్యను నరికేశాడు..

కరోనా మహమ్మారి అయినవాళ్లను, కానీవాళ్లను అందర్నీ దూరం చేస్తోంది. కరోనా సోకిందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగు చూసింది. కావలికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యకు కరోనా సోకిందని.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. 
 
కత్తితో రెండు చేతులను నరికేశాడు. అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.