బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (10:11 IST)

నగరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు.. మంత్రి రోజా

rk roja
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజాకు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగడంతో ఆమె స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
నగరి టికెట్ దొరక్కపోయినా పర్లేదని.. ఆ టిక్కెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై స్పష్టమైన వ్యూహం లేదని.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్నారని, వారి సర్వే విధానాన్ని ఆమె విమర్శించారు.
 
అలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి రోజా ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ విజయంపై విశ్వాసంతో ఉన్న ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సీటు ఇవ్వకున్నా సీఎం జగన్‌కు తిరుగులేని మద్దతు ప్రకటించారు.