సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:51 IST)

న‌గ‌రిలో స్కూట‌ర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రాని విద్య అంటూ లేదు. ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి చ‌క్క‌గా స్కూట‌ర్ ర్యాలీలో పాల్గొనడం చూసి అంతా ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు. సాధార‌ణంగా ఎమ్మెల్యేలు బైక్ ర్యాలీలో కొద్ది దూరం బండి న‌డిపి, కారు ఎక్కేస్తారు. కానీ ఎమ్మెల్యే రోజు ఆద్యంతం బైక్ ర్యాలీలో పాల్గొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.
 
నగరి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష , కోఆప్షన్ నెంబర్, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోజా ఈ సాహ‌సం చేశారు. స్వ‌యంగా బైక్ న‌డ‌ప‌డ‌మే కాకుండా, వెనుక మ‌రో మ‌హిళా కార్య‌క‌ర్త‌ను ఎక్కించుకుని మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యం వ‌ర‌కు వ‌చ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే రోజాని కృతజ్ఞతా పూర్వకంగా సన్మానం చేసిన మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, పాలకవర్గ సభ్యులు , జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు,  ముఖ్య నాయకులు, అభిమానులు మరియు మండల స్థాయి అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మేల్యే నగరి టవర్ క్లాక్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు అభిమాన జన సందోహంతో కలసి బైక్ ర్యాలీ చేసుకుంటూ వచ్చారు.