Widgets Magazine

దేశాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..

శుక్రవారం, 15 జూన్ 2018 (09:02 IST)

Widgets Magazine

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజులుగా భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిపుర, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.


వివరాల్లోకి వెళితే..  కేరళలోని కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలూకా కట్టిపారలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. దీంతో కేరళలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 27కి పెరిగింది. 
 
అలాగే ఉత్తరప్రదేశ్‌లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 15మంది మృతి చెందారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మరో నలుగురు మృతి చెందారు. ఇక వరదల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే మరిన్ని బలగాలను, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను.. ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని సీఎం విప్లవ్ దేవ్ కేంద్రాన్ని కోరారు. 
 
మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్‌లోనూ ఇటువంటి పరిస్థితే ఉండడంతో రాజధాని ఇంఫాల్ సహా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 31 శాతానికి వర్షపాతం నమోదైందని వారు తెలిపారు. 
 
అలాగే వచ్చే 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిమ్, హిమాలయాస్, పశ్చిమ బెంగాల్, కేరళ, ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ ...

news

ఐవైఆర్ క్రిష్ణారావును చూసి భయపడుతున్న టిటిడి.. ఎందుకు?

ఇటీవల టిటిడిలో చోటుచేసుకున్న పరిణామాలపై కొందరికి నోటీసులు ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించిన ...

news

వామ్మో లేడీ బాహుబలి... ఏం చేసిందంటే?

బాహుబలి చిత్రంలో హీరో ఎంత బలశాలో మనం చూశాం. కానీ ఇప్పుడు ఒక లేడీ బాహుబలిని చూసి ప్రపంచమే ...

news

ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ : సోనూ శర్మ

ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని హైదరాబాద్‌లోని మయూరి పాన్ షాపు ...