మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (12:37 IST)

లోకేశ్ రాజకీయ బచ్చా.. అందుకే వదిలేస్తున్నా.. మోత్కుపల్లి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ యువనేత, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ జోలికి మాత్రం వెళ్ల

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ యువనేత, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ జోలికి మాత్రం వెళ్లనని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. నారా లోకేశ్ రాజకీయ పిల్లవాడనీ వ్యాఖ్యానించారు.
 
కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటుగా విమర్శలు చేసిన మోత్కుపల్లి... లోకేశ్‌ వయసులో చిన్నవాడనే ఉద్దేశంతోనే ఆయన గురించి మాట్లాడకుండా వదిలేస్తున్నట్టు చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ నాది. రాజీనామా చేయను. పార్టీని వీడాల్సిన అవసరం నాకు లేదు' అని స్పష్టం చేశారు. పట్టపగలు ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి.. ఓ నీచుడని విమర్శించాను. ఆ కేసు వల్లే కేసీఆర్‌కు చంద్రబాబు లొంగిపోయారని అన్నారు. 
 
ఎన్టీఆర్‌ కుటుంబంతోపాటు ఏపీలోని అన్ని కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. బాబు రాజకీయ అనుభవం ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పనిచేయలేదా? అని ప్రశ్నించారు. ఆయనకు పౌరుషం ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.