మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (14:38 IST)

ఐసీయూలో వైకాపా... ఆక్సిజన్ ఇస్తున్న బీజేపీ : నారా లోకేశ్

వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సారథ్యంలోని వైకాపా ఐసీయూలో ఉందనీ, దానికి భారతీయ జనతా పార్టీ ఆక్సిజన్ అందిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడలో

వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సారథ్యంలోని వైకాపా ఐసీయూలో ఉందనీ, దానికి భారతీయ జనతా పార్టీ ఆక్సిజన్ అందిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని, కేసుల మాఫీ కోసం వైసీపీ పాట్లు పడుతోందన్నారు.
 
కొందరు వ్యక్తులు కొన్ని శక్తుల ప్రోద్భలంతో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను తప్పు చేసినట్టు ఏ ఒక్క చిన్నపాటి ఆధారం ఉన్నా తక్షణం బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే, ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. అవేమీ చూడకుండా ఉద్దానానికి ఏమీ చేయలేదనడం సరికాదని, కిడ్నీ వ్యాధి ప్రబలిన చోట ఆర్వోసీ ప్లాంట్లు ఏర్పాటుచేశామని లోకేష్ వెల్లడించారు. 
 
ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించి... మళ్లీ చంద్రబాబును గెలిపించాలని మహానాడులో మంత్రి లోకేశ్‌ పిలుపు ఇచ్చారు. తిరుపతి వెంకన్న పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి జోలికి వెలితే మాడి మసైపోతారన్నారు. రూ.162 కోట్లతో 1750 పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. 17 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని మంత్రి వివరించారు. ఉపాధి హామీలో అవినీతి జరుగుతోందని అసత్యప్రచారం చేస్తూ.. కేంద్రం నుంచి నిధులు రాకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని లోకేశ్‌ ధ్వజమెత్తారు.