మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 23 మే 2018 (17:25 IST)

చేతులు పిసుక్కుంటూ భాజపా... మొత్తం సినిమా 2019లో వుందంటున్న నారా లోకేష్

భాజపాకు అధికారం నోటి దాకా వచ్చినట్టే వచ్చి నేలపాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కేవలం 8 స్థానాల దూరంలో అధికారాన్ని వదిలేయాల్సి వచ్చింది. దీనిపై కర్నాటకలోని ప్రతిపక్షాలతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీ చాలా మజా చేసుకున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్

భాజపాకు అధికారం నోటి దాకా వచ్చినట్టే వచ్చి నేలపాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కేవలం 8 స్థానాల దూరంలో అధికారాన్ని వదిలేయాల్సి వచ్చింది. దీనిపై కర్నాటకలోని ప్రతిపక్షాలతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీ చాలా మజా చేసుకున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే జస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ సాధించడంలో విఫలమై ముఖ్యమంత్రి పదవి రాక భాజపా చేతులు పిసుక్కుంటూ కూర్చుంది.
 
భాజపాకు అధికార పగ్గాలు రాకపోవడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖలో ధర్మపోరాట సభలో మాట్లాడుతూ.... కర్నాటకలో జరిగినది భాజపాకు కేవలం ట్రెయిలర్ మాత్రమేననీ, మొత్తం సినిమా 2019లో కనబడుతుందంటూ వ్యాఖ్యానించారు. కర్నాటకలో తెలుగు ప్రజలు భాజపాకు ట్రెయిలర్ చూపించారనీ, మొత్తం సినిమా 2019లో చూపిస్తారని అన్నారు. 
 
2014 ఎన్నికల్లో కనీసం వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేని భాజపాకు తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిందనీ, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని తమ పార్టీ చేయూతనిస్తే తమ నమ్మకాన్ని వమ్ము చేసిందని అన్నారు. తెలుగు ప్రజలకు తేడా చేస్తే ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందనీ, గతంలో తెదేపా పైన ఇందిరా గాంధీ కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు.