మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (22:23 IST)

నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం.. ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన సోమవారం కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. 
 
అయితే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది. 
 
అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌‌ను అదుపు చేశారు. దాంతో లోకేశ్‌కు ప్రమాదం తప్పినట్టయింది. లోకేశ్ సురక్షితంగా బయటపడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.