శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (10:58 IST)

వేట మొదలు.. తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీ సీజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో టీడీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 
 
అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మరో టీడీపీ నేతకు చెందిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారు. 
 
ఇపుడు మాజీ మంత్రి, నారాయణ గ్రూపు సంస్థల అధినేత పి. నారాయణకు చెందిన నారాయణ జూనియర్ కాలేజీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం తిరుపతిలో నారాయణ జూనియర్ కాలేజీని సీజ్ చేశారు.