బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 30 ఆగస్టు 2021 (11:04 IST)

తిరుమ‌ల‌లో శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

కృష్ణాష్టమి సందర్భంగా, తిరుమల శ్రీవారికి వినూత్నంగా నవనీత సేవ ప్రారంభిస్తున్నామని, టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. దేశ ప్రజలకు, టిటిడి తరఫున ఆయ‌న కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
 
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా, ఇవాళ ఉదయం టీటీడీ బోర్డు చైర్మన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వెలుపల వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ భగవానుడుకి ఇష్టమైన నవనీత సేవను నేడు తిరుమల శ్రీవారికి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించామని, తిరుమల, తిరుపతి గోశాలల్లో గోవుల నుండి పాలను సేకరించి, అభిషేకానికి ఉపయోగించడంతో పాటు, పాల నుండి వెన్న సేకరించి నవనీత్ సేవను ప్రారంభిస్తున్నామన్నారు.
 
గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసే సాంప్రదాయ ఆహార విక్రయాలను, నిలిపివేస్తున్నట్లు తెలిపారు.. భక్తులకు ఉచిత దర్శనంపై కోవిడ్ నేపధ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.