ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (10:58 IST)

గుర్తుతెలియని ప్రాంతానికి ఆనందయ్య - బంధువుల ఆందోళన

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బోణిగి ఆనందయ్యను నెల్లూరు జిల్లా పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. గత నాలుగైదు రోజులుగా కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్యను పోలీసులు తరలించారు. ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు స్పష్టం చేయడం లేదు. 
 
దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో బంధువులు పోలీసులను నిలదీస్తున్నారు. 
 
మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 
 
మరోవైపు, పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు దొంగచాటుగా మందు తయారు చేయించుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్యను సీవీఆర్ అకాడెమీ నుంచి మరో ప్రాంతానికి పోలీసులు గురువారం తరలించారు.